సాక్షి హైదరాబాద్: కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు ( మంగళవారం) కేసీఆర్ జన్మదినం సందర్బంగా బీఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ని పట్టుకొని కొంతమంది నేతలు ఇష్టమెుచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తెలంగాణ హీరో అని తెలిపారు. ఆయన నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఆయన భగవంతున్ని కోరుత్నుట్లు తెలిపారు.
సంచులు మెసేవారికి జాతి గురించి కానీ దాని గౌరవం గురించి గాని ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని ఒకటేమో తెలంగాణ జాతయితే మరోకటి రాష్ట్ర ద్రోహులదని తెలిపారు. బీర్ఎస్ పార్టీకి అధిష్ఠానం ఆడిస్తే ఆడడం తెలియదని కేటీఆర్ అన్నారు. ఏ జాతికి జాతిపిత అని మాట్లాడుతున్నారు. రుద్రమదేవి, కొమురం భీం, సర్వాయి సర్దార్ పాపన్న, కాళోజీ , చాకలి ఐలమ్మ, తుర్రెబాజ్ ఖాన్, దాశరథి, తెలంగాణ విద్యార్థి అమరవీరుల జాతి మాదని కేటీఆర్ అన్నారు.
ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ భవన్‌కు భారీగా నేతలు తరలివచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపారు. కాగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలు చోట్ల కేకులు కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.


