కాంగ్రెస్‌కు బుల్లెట్‌ దించి..! | isnapur chairman election political twist brs victory | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బుల్లెట్‌ దించి..!

Feb 17 2026 12:02 PM | Updated on Feb 17 2026 2:12 PM

isnapur chairman election political twist brs victory

సంగారెడ్డి జిల్లా: ఇస్నాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవడంతో స్థానిక రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారా యి. ఇస్నాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించేందుకు ఒకే కారులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావులు కలిసి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

కౌన్సిలర్ల మార్పు లు కూడా ఎన్నికలో కీలకంగా మారాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ కాంగ్రెస్‌లో చేరగా, కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన కౌన్సిలర్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పరిణామాల తర్వాత బలాబలాలు మారా యి. బీఆర్‌ఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 13 సమానంగా వచ్చాయి. అయితే ఎక్స్‌ అఫీషియో లు ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ బీఆర్‌ఎస్‌కు వేయడంతో బీఆర్‌ఎస్‌ సంఖ్య 15 కు చేరింది. 

ఎక్స్‌అఫీషియో ఓట్లతో ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పీఠం బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఈ ట్విస్ట్‌తో ఇస్నాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి బయటకు వెళ్తూ ‘ఎప్పుడొచ్చామన్నది కాదు..బుల్లెట్‌ దిగిందా? లేదా?’అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement