సాక్షి,హైదరాబాద్: ఓ కథనానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పాలన ప్రతిసారీ ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేస్తోంది.జర్నలిస్టులను నేరస్తుల్లా చూడటం దురదృష్టకరం. నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు కదా?. అర్థరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి అతిగా ప్రవర్తించడం సరికాదు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి’అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టులను అత్యంత అమానవీయ పద్ధతిలో, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు
Dear @RahulGandhi,
I hope you are taking note of how the Telangana branch of your "Mohabbat ki Dukan" is trampling upon constitutional rights of citizens. Last night, three journalists were abducted by state police. In once instance, police broke open the doors of a journalist's…— KTR (@KTRBRS) January 14, 2026


