సాక్షి, హైదరాబాద్: కేటీఆర్ సిట్ నోటీసులపై హరీష్‌రావు స్పందించారు. నోటీసులతో ప్రభుత్వం చేసేదేమీ లేదన్నారు. హామీలపై ప్రశ్నిస్తుంటే నోటీసులు ఇస్తున్నారన్న హరీష్.. అటెన్షన్ డైవర్షన్‌లకు భయపడబోమన్నారు. ‘‘నాకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ వెంటే పడతాం’’ అంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
నీ బావమరిది కుంభకోణం బయటపడొద్దనే ఈ డైవర్షన్ డ్రామా. ఇప్పుడు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. నేను, కేటీఆర్ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే సిట్ నోటీసులు ఇస్తున్నారంటూ హరీష్‌రావు మండిపడ్డారు. ‘‘బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేదు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా రేవంత్.. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటం’’ అని హరీష్ తేల్చి చెప్పారు.


