నేడు సిట్‌ ముందుకు కేటీఆర్‌.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు | KTR to attend SIT investigation in phone tapping case Live updates | Sakshi
Sakshi News home page

నేడు సిట్‌ ముందుకు కేటీఆర్‌.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు

Jan 23 2026 7:30 AM | Updated on Jan 23 2026 9:13 AM

KTR to attend SIT investigation in phone tapping case Live updates

కేటీఆర్‌ సిట్‌ విచారణ.. లైవ్‌ అప్‌డేట్స్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. నేడు కేటీఆర్‌ విచారణ

తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు

  • కోకాపేట టెంపుల్ ట్రీ నివాసం నుండి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు
  • తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ రానున్న కేటీఆర్
  • కేటీఆర్‌తో పాటే హరీష్ రావు
  • తెలంగాణ భవన్ చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు
  • పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేటీఆర్
  • 10 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్
  • 10:30 కు బయలుదేరి జూబ్లీహిల్స్ పీఎస్‌కి వెళ్ళనున్న కేటీఆర్
  • రాత్రి బీఆర్‌ఎస్‌ లీగల్ టీంతో సమావేశమైన కేటీఆర్,హరీష్ రావు
  • ఇప్పటివరకు ఈ కేసులో విచారించిన వ్యక్తులను ఏం ప్రశ్నించారు?
  • కేటీఆర్‌ను ఏం ప్రశ్నించబోతున్నారు అనే విషయాలను బ్రీఫ్ చేసిన లీగల్ టీం

బీఆర్‌ఎస్‌ నేతలు,ఓయూ విద్యార్థుల అరెస్ట్‌

  • కేటీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు 
  •  సిట్ విచారణకు కేటీఆర్.. ఓయూ విద్యార్థుల అరెస్ట్
  • అర్దరాత్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బీఆర్‌ఎస్‌వీ కార్యదర్శి జంగయ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు

జూబ్లీహిల్స్‌ పీఎస్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

  • పోన్ ట్యాపింగ్ కేసులో నేడు  వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌ విచారణ
  • 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణ
  • కేటీఆర్‌ను విచారించనున్న జాయింట్ సీపీ విజయ్ కుమార్,ఏసీపీ వెంకట గిరి
  • కేటీఆర్‌ విచారణ  కోసం ప్రత్యేక ప్రశ్నలు సిద్దం చేసిన సిట్
  • జూబ్లీహిల్స్ పీఎస్,తెలంగాణ భవన్‌ వద్ద భారీ భద్రత
  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • పోలీస్ స్టేషన్‌కి రెండు వైపులా భారీకేడ్లు ఏర్పాటు  
  • రంగంలోకి లోకల్ పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు 

మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్‌

  • మరికాసేపట్లో కోకాపేట నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు కేటీఆర్‌

  • కేటీఆర్‌ వెంట మంత్రి హరీష్‌ రావు కూడా!

  • తెలంగాణ భవన్‌లో కీలక నేతలతో భేటీ

  • అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం

  • అక్కడి నుంచే సిట్‌ విచారణకు కేటీఆర్‌.. 

కేటీఆర్‌ను విచారించనున్న వెంకటగిరి

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణ జరుపుతున్న సీపీ సజ్జనార్‌ నేతృత్వంలోని బృందం

  • కేటీఆర్‌ను విచారించనున్న వెంకటగిరి అండ్‌ టీం

  • ఇంతకు హరీష్‌రావును విచారించిన ఇదే బృందం

విచారణకు రావాలంటూ నోటీసులు

  • కేటీఆర్‌కు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నోటీసులు

  • సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద విచారణకు రావాలని పిలుపు

  • నందినగర్‌ నివాసంలోని వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందజేత

  • ఇవాళ ఉదయం 11గం. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో సిట్‌ ఎదుట హాజరు కావాలని నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement