తెలంగాణకు మళ్లీ అన్యాయం | KTR About Union Budget 2026 | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మళ్లీ అన్యాయం

Feb 2 2026 2:02 AM | Updated on Feb 2 2026 2:02 AM

KTR About Union Budget 2026

హైదరాబాద్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రానికి దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీల అమలులో కేంద్రం పుష్కరకాలంగా వివక్ష చూపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లినా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా సాధించలేకపోయారు. బీజేపీ పెద్దలతో ‘‘బడే భాయ్‌–చోటే భాయ్‌’’అనుబంధం వల్ల రాష్ట్రానికి నిధుల వరద వస్తుందన్న భావన ఈ బడ్జెట్‌తో బూటకమన్న విషయం స్పష్టమైంది.

తనపై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే సీఎం ఢిల్లీ పర్యటనలు చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కనీసం ప్రయత్నించలేదు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో విస్తరణ, రీజనల్‌ రింగ్‌ రోడ్డు, కొత్త రైల్వే లైన్లు, వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్, ఐఐఎం, సిరిసిల్ల మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి కీలక డిమాండ్లపై పదేళ్లుగా విజ్ఞప్తులు చేసినా కేంద్రం ఏ ఒక్కదానికీ న్యాయం చేయలేదు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.  – కేటీఆర్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. 

Advertisement
 
Advertisement
Advertisement