సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు | BRS Leader KTR fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Mar 18 2026 11:28 PM | Updated on Mar 19 2026 1:08 PM

BRS Leader KTR fires On CM Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు.  

కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.

వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్‌కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement