సాక్షి, హైదరాబాద్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. రేపు(ఫిబ్రవరి 1న) మధ్యాహ్నాం 3గం. టైంలో నందినగర్ నివాసంలో విచారణకు తమకు అందుబాటులో ఉండాలని ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో విచారణ జరపాలన్న ఆయన విజ్ఞప్తిని టెక్నికల్ రీజన్ చూపిస్తూ తిరస్కరించింది.
కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో నందినగర్ అడ్రస్ ఉందని.. అందుకే ఆ ఇంటికి నోటీసులు అంటించామని సిట్ చెబుతోంది. అయితే గోడకు అంటించే నిబంధన ఏదీ లేదని.. పైగా ఇలా అంటించడం చట్ట విరుద్ధమని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును లీగల్ టీం ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. అంతేకాదు.. హరీష్‌రావు అఫిడవిట్‌లో సిద్ధిపేట అడ్రస్ ఉందని.. అయినప్పటికీ హైదరాబాద్ అడ్రస్‌కే సిట్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది.
కేసు విచారణకు సంబంధించి నోటీసులు పంపడం కోసం రిజిస్టర్డ్ పోస్టు, కోర్టు తదితర ప్రక్రియల ద్వారా సర్వ్ చేయడం మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. గోడకు అతికించడం సరైన నోటీసు సర్వ్ చేసినట్లుగా పరిగణించబడదని.. ఈ లెక్కన కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు చెల్లవని అంటోంది. అయితే.. దీనిపై న్యాయ నిపుణుల మాట మరోలా ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024 డిసెంబర్ 17న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో.. (రాజేంద్ర కుమార్ వర్సెస్ యూపీ అవాస్ ఎవమ్ వికాస్ పరిషత్ సివిల్ అప్పీల్ నెం. 14604 of 2024 ప్రకారం).. ఇంటి గోడలపై నోటీసులు, ప్రకటనలు అతికించడం వంటి చర్యలు చట్టబద్ధం కాదు. ఇది ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం కిందకే వస్తుంది. దీనికిగానూ జరిమానా, శిక్షలు విధించవచ్చు. కానీ,
కేసీఆర్‌కు సిట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 160 ప్రకారం జారీ చేసింది. దర్యాప్తు జరుగుతున్న కేసులో సాక్షిగా లేదంటే విచారణ కోసం ఓ వ్యక్తిని పిలిచే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇది సాధారణంగా అఫిక్స్‌డ్ నోటీసు (Affixed Notice) అనే ప్రక్రియలో భాగమేనని అంటున్నారు. ఒక వ్యక్తి నోటీసు స్వీకరించనప్పుడు లేదంటే ఆ నోటీసుల స్వీకరణకు గనుక అందుబాటులో లేకపోతే కోర్టు లేదంటే దర్యాప్తు సంస్థలు ఇలా ఇంటి గోడలకు నోటీసులు అతికించడం ద్వారా సర్వ్ చేసినట్లుగా పరిగణిస్తాయి. కాబట్టి.. ఈ నోటీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడం తప్ప బీఆర్‌ఎస్‌కు మరొ మార్గం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?
స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo— KTR (@KTRBRS) January 31, 2026


