సాక్షి, ఖమ్మం: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో కేటీఆర్ రోడ్ షోలో వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో పాటు వైఎస్సార్‌సీపీ జెండాలు రెపరెపలాడాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్సార్‌సీపీ జెండాలతో జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


