రాహుల్, రేవంత్‌లను ఉరితీయాలన్న వ్యాఖ్యలను తప్పు పట్టిన నేతలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిలను ఉరి తీయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు. రాహుల్ గాంధీ, రేవంత్‌లను ఏకంగా ఉరితీయాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమని, ఆయన అహంకారం పీక్స్‌కు చేరిందని, ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు.
భస్మాసురుడి కజిన్ బ్రదర్ కేటీఆర్: మహేశ్‌గౌడ్
కేటీఆర్ వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్ కుమార్‌గౌడ్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్‌లో అహంకారం పరాకాష్టకు చేరిందని, ఆయన భస్మాసురుడి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతితో ప్రజల ఛీత్కారానికి గురైన నేపథ్యంలో ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టులో తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. ఈ అంశాన్ని పక్క దోవ పట్టించేందుకు చౌకబారు మాటలు మాట్లాడుతు న్నారని విమర్శించారు. ముందు తన చెల్లెలు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి కేటీఆర్ తమ గురించి మాట్లాడాలని మహేశ్‌గౌడ్ హితవు పలికారు.
అవినీతిని బయటపెట్టడంతో ఆగమాగం: విప్ శ్రీనివాస్
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఉపన్యాసంతో కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతోందని, పదేళ్ల పాటు వా రు చేసిన తప్పులను రేవంత్ తూర్పారపట్టడంతో కేటీఆర్, హరీశ్‌రావులు తల్లడిల్లిపోతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు తామే చాంపియన్లమంటూ చెలామణి అయిన కేసీఆర్ కుటుంబం అవినీతి చరిత్రను అసెంబ్లీలో బయటపెట్టేసరికి ఇప్పుడు ఆగమాగమవుతు న్నారని ఎద్దేవా చేశారు.
కళ్లకు కట్టినట్టు వివరించారు: ఎంపీ చామల
రాష్ట్ర సాధన నినాదాలైన నీళ్లు, నిధు లు, నియా మకాలను బీ ఆర్‌ఎస్ తుంగలో తొక్కిందని రుజు వైందని, పదేళ్ల కాలంలో కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా బీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజె క్టులను సీఎం రేవంత్‌రెడ్డి కళ్లకు కట్టిన ట్టు వివరించారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమా ర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా కేసీఆర్ చావు కోరుకునేది కేటీఆర్, హరీశ్ రావులేనని, సీఎం పదవి కోసం కేటీఆర్, పార్టీ కోసం హరీశ్‌రావులు మాత్రమే కేసీఆర్ చావును కోరుకుంటారని, అలాంటి ఆలోచన ఎవరికీ ఉండదన్నారు.


