నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan expresses deep shock over Nellore Medical Students Incident | Sakshi
Sakshi News home page

నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Apr 30 2025 5:27 PM | Updated on Apr 30 2025 5:43 PM

YS Jagan expresses deep shock over Nellore Medical Students Incident

గుంటూరు, సాక్షి: నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్న ఆయన..  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారాయన.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే ఓ కారు అదుపు తప్పిన ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో.. ఐదుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. 

ఇదీ చదవండి: నెల్లూరులో కారు బీభత్సం: ఘోర ప్రమాదం ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement