
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట‍్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు.
All is well ❤️
Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home.
My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025