సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ జేఎన్టీయూ ఫ్లై ఓవర్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. TS 09 FU 5136 నెంబర్ గల కారు వేగంగా దూసుకొచ్చింది. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కారు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోల్తా పడిన కారును మరో ప్రాంతానికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరూ సూడాన్ దేశస్థులుగా గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


