ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో అదుపుతప్పిన పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
ఈ ఘటనపై అంబర్‌నాథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) శైలేష్ కాలే తెలిపిన వివరాల ప్రకారం..‘థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో శుక్రవారం రాత్రి ఒక కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. కారు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు వచ్చిన కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనాలపైకి కారు దూసుకెళ్లడంతో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా పలు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయని తెలిపారు. మృతుల గుర్తింపును నిర్ధారించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు.
Horrible accident in Maharashtra's Thane caught on camera. A Nexon car lost control and rammed into multiple approaching vehicles. Four people, including the driver of the car, lost their lives in the accident. pic.twitter.com/9rd4UKkuVg
— Vani Mehrotra (@vani_mehrotra) November 22, 2025


