బీభత్సం సృష్టించిన తెలుగు నటుడి కారు | Actor Bobby Simha Car Issue Latest News | Sakshi
Sakshi News home page

Bobby Simha: వాహనాలపై దూసుకెళ్లిన ప్రముఖ నటుడి కారు

Apr 19 2025 2:34 PM | Updated on Apr 19 2025 2:43 PM

Actor Bobby Simha Car Issue Latest News

విలన్, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు బాబీ సింహా. స్వతహాగా తెలుగువాడే అయినప్పటికీ తమిళంలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. తాజాగా ఇతడి కారు వల్ల పలువురికి గాయాలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

నటుడు బాబీ సింహకు చెందిన కారు.. శనివారం ఉదయం ఎక్కడుతంగల్-చెన్నై ఎయిర్ పోర్ట్ రోడ్డులో వెళ్తున వాహనాలపై దూసుకెళ్లింది. ఈ సంఘటనలో సుమారు ఆరు వాహనాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.

(ఇదీ చదవండి: 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌)

డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఇలా జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగిన టైంలో బాబీ సింహ కారులో లేరని పోలీసులు తేల్చారు.

తమిళ మూవీ 'జిగర్తాండ'తో మంచి ఫేమ్ సంపాదించిన బాబీ సింహ..  పేట, వాల్తేరు వీరయ్య, డిస్కో రాజా, 777 చార్లీ, సలార్, ఇండియన్ 2 తదితర చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

(ఇదీ చదవండి: హీరో అజిత్‌కు మరోసారి కారు ప్రమాదం.. వీడియో వైరల్‌)

Advertisement
 
Advertisement
Advertisement