ట్రక్కును ఢీకొట్టిన కారు.. అయిదుగురు మృత్యువాత | Rajasthan: 5 killed in car truck collision in Udaipur | Sakshi
Sakshi News home page

ట్రక్కును ఢీకొట్టిన కారు.. అయిదుగురు మృత్యువాత

Nov 22 2024 1:41 PM | Updated on Nov 22 2024 1:42 PM

Rajasthan: 5 killed in car truck collision in Udaipur

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయపూర్ జిల్లాలో ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అయిదుగురు వ్యక్తులు కారులో అంబేరి నుంచి దేవరీ వైపు వెళుతుండగా వారి వాహనం ట్రక్కును ఢీకొట్టింది. 

దీంతో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను  అదుపులోకి తీసుకొని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఉదయపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి హిమాన్షు సింగ్ రాజావత్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement