తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. కారులో ఎగిసిపడిన మంటలు(వీడియో) | Car Fire Accident At Tirumala Ghat Road | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. కారులో ఎగిసిపడిన మంటలు(వీడియో)

Apr 20 2025 11:17 AM | Updated on Apr 20 2025 12:02 PM

Car Fire Accident At Tirumala Ghat Road

సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్‌ రోడ్డు ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఘాట్‌ రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, కారులో ఉన్న ప్రయాణీకులు, అటుగా వెళ్తున్న భక్తులు భయంతో పరుగులు తీశారు.

వివరాల ప్రకారం.. తిరుమలలోని రెండో ఘాట్‌ రోడ్డులో భాష్యకార్ల సన్నిధి వద్ద కారులో మంటలు చెలరేగాయి. కారు ఇంజిన్‌ ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో​ కారు దిగి భక్తులు పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. మంటల చెలరేగిన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, మంటల్లో కారు కాలిపోయినట్టు తెలుస్తోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement