సాక్షి, తిరుమల: తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో ఈ రోజు ఉదయం కారు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలతోనే భక్తులు బయటపడ్డారని తెలుస్తోంది.
సమాచారం ప్రకారం.. మొదటి ఘాట్ రోడ్డులోని 2వ కిలోమీటర్ మైలురాయికి సమీపంలో బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ కారులో ఉన్న భక్తులు తమిళనాడుకు చెందిన వారు కాగా తిరుమలకు పర్యటన కోసం వచ్చారు. అయితే కారులో ఉన్న వారందరూ స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు.
ఇదిలా ఉంటే ఈ ఘటన కారణంగా ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. కారు బోల్తా పడి రోడ్డుకు అడ్డంగా ఉండటంతో తిరుమల వెళ్లే భక్తుల వాహనాలకు మరింత ఆలస్యం ఏర్పడింది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించారు. గాయపడిన భక్తులను తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.


