సాక్షి, యాదాద్రి భువనగిరి: బీబీనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. యువతి, యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారు ఢీకొట్టడంతో యువతి చెరువులోకి ఎగిరిపడింది. అతి వేగంగా వచ్చి చెరువు కట్ట మూల మలుపు వద్ద డివైడర్‌ను ఢీ కొట్టిన థార్ వాహనం.. అదే సమయంలో అక్కడే నిలిచి ఉన్న యువతి, యువకుడిని ఢీ కొట్టింది.
అక్కడికక్కడే యువకుడు మృతి చెందగా.. యువతి చెరువులో పడిపోయి మృతి చెందింది. థార్ వాహనంలో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


