పలన్‌పూర్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కు.. కారుని ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బనాస్కంఠ జిల్లాలోని ఇక్‌బాల్‌గాథ్‌లోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
If you are driving a truck on Highway & a biker suddenly turns in front of you and you have no time to brake, what would you do?
This truck turned right, saved bike, hit car 3 de@d
Baruva Junction,near Korlam Village, Srikakulam District, Andhra Pradesh.pic.twitter.com/4q89UBfpJg— Gary Pike 🇺🇦🇮🇳 (@PikeWala) January 25, 2026
రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ఇన్నావో కారును ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్‌తో కలిపి 10 మంది ఇన్నోవా కారులో ఉన్నారు. వీరిలో ఏడుగురు మృత్యువాత పడగా, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


