రాయదుర్గం: కారు నుజ్జునుజ్జు.. స్టూడెంట్‌ మృతి | Raidurgam Bridge Car Crashed Student Dies Telugu News | Sakshi
Sakshi News home page

రాయదుర్గం: కారు నుజ్జునుజ్జు.. స్టూడెంట్‌ మృతి

Aug 2 2024 8:07 AM | Updated on Aug 2 2024 10:40 AM

Raidurgam Bridge Car Crashed Student Dies Telugu News

సాక్షి, హైదరాబాద్‌: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్‌తో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 

మృతుడ్ని ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్‌(19)గా పోలీసులు గుర్తించారు. బీఎన్‌ఆర్‌ హిల్స్‌ నుంచి చరణ్‌ మెహదీపట్నంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఫ్లై ఓవర్‌ ఫిల్లర్‌ను ఢీ కొట్టడంతో కారు ప్రమాదానికి గురైంది. కారు నుజ్జు అయ్యి స్పాట్‌లోనే చరణ్‌ చనిపోయాడని, ఇరుక్కుపోయిన ఆ మృతదేహాన్ని కష్టం మీద బయటకు తీసినట్లు తెలిపారు. 

అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిపిన పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement