
సాక్షి, దుండిగల్: ‘యమలీల’ సినిమా చూసిన ప్రేక్షకులకు బ్రహ్మానందం చేసిన హాస్యభరితమైన ఓ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. ‘ఆవు గోడపైకెక్కి పేడ ఎలా వేసిందంటావు’? అని పిడకలను చూసి కోట శ్రీనివాసరావును ప్రశ్నించడం కడుపుబ్బా నవ్వు తెప్పిస్తుంది. అలాంటి ఓ దృశ్యమే దుండిగల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
నిద్ర మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తి సడన్‌గా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి ఇలా ఓ ఇంటి గోడపైకెక్కి ఆగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ కారు బౌరంపేట నుంచి మల్లంపేట వైపు వేగంగా దూసుకువచ్చింది. ఈ క్రమంలో మహేశ్వరం వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంటి ప్రహరీని ఢీకొంది.
ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. ఉదయం నిద్రలేచి చూసిన ఆ ఇంటి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. విషయాన్ని పోలీసులకు తెలపగా.. సదరు వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపించాడా..? నిద్ర మత్తులో ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గోడపై పార్కింగ్ చేసినట్లు ఉన్న కారు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ‘అలా ఎలా పార్క్ చేశావు బ్రో’ అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.
:
🚨 तेलंगाना में ड्रिंक एंड ड्राइव का अनोखा मामला
नशे में धुत शख्स ने कार सीधे घर की दीवार पर चढ़ा दी!
📍 मेडचल, हैदराबाद
🚗 Tata Altroz को JCB से नीचे उतारा गया
😯 कोई हताहत नहीं
⚠️ "कार चलाना खेल नहीं है" - सोशल मीडिया रिएक्शन#DrinkAndDrive #Hyderabad #ViralVideo… pic.twitter.com/vnAlYNvqSM— Indian People (@Indianpeople218) July 26, 2025