పెట్రోల్‌ బంకులో అగ్ని ప్రమాదానికి గురైన కారు | Car Accident In Petrol Bunk Mahabubabad District | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకులో అగ్ని ప్రమాదానికి గురైన కారు

Apr 11 2025 8:56 PM | Updated on Apr 11 2025 9:10 PM

Car Accident In Petrol Bunk Mahabubabad District

మహబూబాబాద్ జిల్లా:  జిల్లాలోని తొర్రూరు మండలం వెలికట్టు గ్రామ శివారులోని పెట్రోల్‌ బంకుకు అతి సమీపంలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ కొట్టించుకున్న తర్వాత బయటకు వెళుతున్న సమయంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్‌ బంకు సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం​ చేశారు.

కారులో ఉన్న వ్యక్తి అప్రమత్తమై వెంటనే బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. పది నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్ని మాపక సిబ్బంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఆవరణంలోని కారులో మంటలు చెలరేగడంతో సమయానికి ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో పెట్రోల్ బంకు పెను ప్రమాదం తప్పింది. 

Advertisement
 
Advertisement
Advertisement