కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం | Car Collides With Truck Four Members Of The Same Family Die In UP Agra, More Details Inside | Sakshi
Sakshi News home page

కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం

Jan 27 2025 12:26 PM | Updated on Jan 27 2025 1:43 PM

Car Collides With Truck Four Members of the Same Family Die

ఫతేహాబాద్‌: యూపీలోని ఆగ్రా పరిధిలో గల ఫతేహాబాద్‌లోని లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

కుంభమేళాకు వెళ్లి, పుణ్యస్నానాలు ఆచరించి, తిరిగి వస్తున్న ఒక కుటుంబం రోడ్డు ప్రమాదం బారినపడింది.  ఈ కుటుంబ యజమాని హైకోర్టు న్యాయవాది అని తెలుస్తోంది.  తొలుత వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి, మరో లేన్‌లోకి వెళ్లింది. తరువాత ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ  దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు, కుమార్తె మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. వారిని గుర్తించిన అనంతరం మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసి ఓం ప్రకాష్ ఆర్య ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంటారు.  తన హ్యుందాయ్ కారులో తన కుటుంబంతో కలిసి ప్రయాగ్‌రాజ్ కుంభ స్నానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక  భార్య పూర్ణిమ సింగ్ (34), కుమార్తె అహానా (12), కుమారుడు వినాయక్ (4)లతో పాటు తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఈ వారు ప్రయాణిస్తున్న కారు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ముందుగా డివైడర్‌ను ఢీకొని ప్రమాదం బారినపడింది.

ఈ ప్రమాదంలో ఓం ప్రకాష్‌తో పాటు అతని కుటుంబమంతా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. సమాచారం అందిన వెంటనే ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్ఎన్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి తరలించారు. దెబ్బతిన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై కొద్దిసేపు ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement