తిరుపతి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి | Three People Dead In Mahabubnagar Road Accident, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుపతి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Aug 29 2024 9:28 AM | Updated on Aug 29 2024 12:19 PM

Three People Dead In Mahabubnagar Road Accident

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని​ భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఓ కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, మృతులను హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement