కాకినాడలో ‘పెళ్లి’ కారు బీభత్సం.. ముగ్గురు మృతి | Car Accident At Kakinada District | Sakshi
Sakshi News home page

కాకినాడలో ‘పెళ్లి’ కారు బీభత్సం.. ముగ్గురు మృతి

Nov 8 2025 8:58 AM | Updated on Nov 8 2025 10:28 AM

Car Accident At Kakinada District

సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు షెల్టర్‌లో వేచి ఉన్న ప్రయాణికుల పైకి అతి వేగంతో వచ్చిన పెళ్లి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కిర్లంపూడి మండలం సోమవారం జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన బస్సు షెల్టర్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. అనంతరం, బైక్‌, రిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: కృష్ణపట్నం పోర్టులో ‘ఎస్‌’ ట్యాక్స్‌.. ఇష్టారాజ్యంగా దోపిడీ.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement