
సింగపూర్: సూపర్ హీరోలు అంటే ఎవరు?.. ప్రత్యేక సూట్లు వేసుకుని అతీత శక్తులతో అద్భుతమైన పనులు చేసినంత మాత్రానా అయిపోతారా?.. అలాంటివేం లేకపోయినా ఆపదలో ఒక నిండు ప్రాణం కాపాడిన సరిపోతుందని నిరూపించారు ఇక్కడ కొందరు. సింగపూర్ గడ్డపై జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ ప్రాంతంలో ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా గొయ్యిలో పడుతుంది. వాస్తవానికి ఆ ప్రదేశం అండర్ గ్రౌండ్‌లో నీటి పైప్ లైన్ పగిలి ప్రమాదకరంగా మారింది. అందుకే ఓ కార్మికుడు వాహనాల రాకపోకల్ని పర్యవేక్షిస్తున్నాడు.
అయినప్పటికీ ఓ కారు ప్రమాదానికి గురైంది. అదిగో అప్పుడే సింగపూర్‌లోని భారతీయ వలస కార్మికులు సూపర్ హీరోలుగా రంగలోకి దిగారు. నిమిషాల్లో ప్రమాదానికి గురైన కారును.. అందులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాల్ని కాపాడారు. ఆ దేశ అధ్యక్షుడితో శభాష్ అనిపించుకున్నారు.
జూలై 26న సింగపూర్‌లోని తంజోంగ్ కాటాంగ్ రోడ్ వద్ద రోడ్డు వ్యవస్థల సమన్వయం కోసం 16 మీటర్ల లోతైన షాఫ్ట్ నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో.. ఒక కాంక్రీట్ భాగం కూలిపోయింది. ఫలితంగా వాటర్ పైప్‌లైన్ పగిలి 3 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ఓ కారు అందులో పడిపోయింది. అందులో ఉన్న మహిళ ప్రమాదంలో చిక్కుకుంది.
ప్రమాదంతో అప్రమత్తమైన ఏడుగురు భారతీయ వలస కార్మికులు పిచ్చై ఉదయప్పన్ సుబ్బయ్య (సూపర్‌వైజర్),వెల్మురుగన్ ముత్తుస్వామి పూమాలై సరవణన్, గణేశన్ వీరసేకర్,బోస్ అజిత్‌కుమార్,నారాయణస్వామి మాయకృష్ణన్, సతపిల్లై రాజేంద్రన్‌లు నైలాన్ తాడు ఉపయోగించి మహిళను 3-5 నిమిషాల్లో సురక్షితంగా బయటకు లాగారు. అనంతరం,అచేతనంగా ఉన్న బాధితురాల్ని స్థానికంగా ఉన్న రాఫెల్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఏ మాత్రం సంకోచించకుండా మహిళ ప్రాణాల్ని కాపాడిన వలస కార్మికులకపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం ఈ సూపర్ హీరోలను ఆగస్టు 3న ఇస్తానా అధ్యక్షుడి భవనంలో భేటీ కానున్నారు. వారికి ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, మినిస్ట్రీ ఆఫ్ మాన్‌పవర్ ఏసీఐ అనే కాయిన్‌ను బహుకరించింది. ItsRainingRaincoats అనే చారిటీ ఎస్‌జీడీ 72,241 (సింగపూర్ డాలర్స్) (భారత కరెన్సీలోరూ.44 లక్షలకుపైగా) విరాళాలు సేకరించింది. వారి కుటుంబాలకు అందించనుంది.
ఈ సంఘటన వలస కార్మికుల హక్కులపై చర్చకు దారితీసింది. వారు ఎదుర్కొంటున్న తక్కువ జీతాలు, అనారోగ్య నివాసాలు, పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
ALERT: 🚨 Car falls directly into sinkhole while attempting to drive though construction area in Tanjong Katong, Singaporepic.twitter.com/JDM1pK6aWW
— E X X ➠A L E R T S (@ExxAlerts) July 27, 2025