సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు | Indian-origin ex-minister Tharman Shanmugaratnam enters race for presidential poll | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు

Published Wed, Aug 23 2023 6:30 AM | Last Updated on Wed, Aug 23 2023 6:30 AM

Indian-origin ex-minister Tharman Shanmugaratnam enters race for presidential poll  - Sakshi

సింగపూర్‌: సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన థర్మన్‌ షణ్ముగరత్నం పోటీ పడుతున్నారు. సెప్టెంబర్‌ 1న జరగనున్న ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

66 ఏళ్ల వయసున్న షణ్ముగరత్నం చైనా సంతతికి చెందిన కాక్‌ సాంగ్, తన్‌ కిన్‌ లియాన్‌తో పోటీ పడతారు. మొత్తం ఆరుగురు నుంచి దరఖాస్తులు రాగా వీరు ముగ్గురు అధ్యక్ష పదవికి పోటీ పడడానికి అర్హత సాధించారని ఎన్నికల కమిటీ ప్రకటించింది. షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించారు. సెప్టెంబర్‌ 1న ఎన్నికలు జరగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement