సింగపూర్: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్నవేళ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జూబీన్ గార్గ్‌ది హత్య కాదని సహజమరణమేనని సింగపూర్ పోలీసులు కోర్టుకు తెలిపారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.
గతేడాది జుబీన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా యాట్ పార్టీకి ఒకరోజు ముందు స్విమ్మింగ్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, జుబీన్‌ది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై భారత్‌లోని అస్సాం పోలీసులు,సీఐడీ విభాగం పలువురిని అదుపులోకి తీసుకుంది. సింగపూర్ పోలీసులు సైతం కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా, కేసు దర్యాప్తు పూర్తి చేసిన సింగపూర్ పోలీసులు కరోనర్ కోర్టుకు రిపోర్టును అందించారు.
రిపోర్టులో ‘యాట్ పార్టీకి ముందు రోజు జూబీన్ స్విమ్మింగ్‌కి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. స్విమ్మింగ్‌కు ముందు లైఫ్ జాకెట్ ధరించారు. కానీ స్విమ్మింగ్ వెళ్లిన తర్వాత లైఫ్ జాకెట్‌ను వద్దన్నారు. రెండు సార్లు లైఫ్ జాకెట్ ధరించాలని నిర్వాహకులు కోరారు. అందుకు జుబీన్ తిరస్కరించారని, స్విమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు కోర్టుకు తెలిపారు.


