న్యూఢిల్లీ : దేశరాజధాని నగరం ఢిల్లీలో శుక్రవారం ఉన్నట్టుండి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో కాలుష్య భూతంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ వాసులకు చాలా ఉపశమనం లభించింది. గాలి నాణ్యత మెరుగుపడుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ వాతావరణాన్ని భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది.
ఢిల్లీ వాతావరణం చల్లగా ఉండటంతో సైమన్ వాంగ్ ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వేడి వేడి చాయ్ కప్పును పకోడీలు, వర్షంతో తడిచిన పచ్చగా మెరుస్తున్న పచ్చిక బయలులో వర్షాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. చాయ్, పకోడితో ఈ ఏడాదిలో (2026) చాయ్ పకోడీతో ఇదే ఫస్ట్ బారిష్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నా.. నాతో చేరండి?” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలను షేర్‌చేశారు.
దీంతో నెటిజన్లు కూడా వర్షంలో తడిచిపోయినంత సంతోష పడ్డారు. చాలా బాగుంది... నేను కూడా వస్తున్నా అని ఒకరు, ఉల్లి పకోడి అయితే సూపర్‌గా ఉంటుంది సార్. అని ఒకరు కమెంట్ చేయగా, “సర్, నేను తయారుచేసిన టీని మీరు తప్పక తాగండి అని మరొకరు కామెంట్ చేయడం విశేషం.
Celebrating first #baarish in 2026 with #chai #pakora. Come join me? 😁 HC Wong pic.twitter.com/Yvd1NYj0vk
— Singapore in India (@SGinIndia) January 23, 2026
దిగి వస్తున్న కాలుష్యం
ఢిల్లీ-NCR శుక్రవారం ఉదయం చల్లని శీతాకాల పరిస్థితుల మధ్య 2026లో తొలిసారి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. IMD ప్రకారం, రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గేఅవకాశం ఉంది. జనవరి 23న, కనిష్ట ఉష్ణోగ్రత 12°C వద్ద నమోదైంది, గరిష్ట ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైంది 19°C. వర్షం తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది, రోజుల తరబడి ప్రమాదకర కాలుష్యం తర్వాత AQI 'సంతృప్తికరమైన' 201-300 స్థాయికి చేరింది.

సైమన్ వాంగ్
2020న జూన్ 30న భారత రిపబ్లిక్‌కు హై కమిషనర్‌గా సైమన్ వాంగ్ వీ కుయెన్‌ను నియమించింది సింగపూర్. ముందు, అతను జూలై 2015 నుండి జనవరి 2020 వరకు తైవాన్‌కు సింగపూర్ వాణిజ్య ప్రతినిధిగా ఉన్నారు.


