
సాక్షి, హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతిచెందింది. మృతురాలిని సౌమ్యరెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ టెంపుల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. బొంగుళూరు గేట్ నుంచి పోచారం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.