సోనియా పుస్తకం: ‘సింగ్ చేతుల్లో ప్రభుత్వం.. నా సైగల్లో కాంగ్రెస్‌’ | Manmohan Singh ran govt I focused on party Sonia | Sakshi
Sakshi News home page

సోనియా పుస్తకం: ‘సింగ్ చేతుల్లో ప్రభుత్వం.. నా సైగల్లో కాంగ్రెస్‌’

Nov 10 2026 10:05 AM | Updated on Nov 10 2026 10:11 AM

Manmohan Singh ran govt I focused on party Sonia

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో అసలు అధికారాలు ఎవరి చేతుల్లో ఉండేవి? ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేసినా.. తెరవెనుక సోనియా గాంధీనే ప్రభుత్వాన్ని నడిపించారన్న విమర్శల్లో నిజమెంత? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జ్ఞాపకాల పుస్తకం 'Belonging: A Journey of Love' ద్వారా సమాధానాలిచ్చారు. యూపీఏ పాలనలో అధికారాల విభజన స్పష్టంగా ఉండేదని ఆమె వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ వ్యవహారాలను చూసుకుంటే.. తాను కాంగ్రెస్ పార్టీని నడిపించానని వివరించారు.

యూపీఏ హయాంలో ప్రభుత్వ నిర్ణయాల్లో తాను జోక్యం చేసుకున్నానన్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. ప్రభుత్వ ఫైళ్లను తనకు పంపించేవారని గతంలో వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అవి పూర్తిగా తప్పుడు, దురుద్దేశపూర్వక ఆరోపణలని తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఫైళ్లను తనకు చూపించేవారన్న ప్రచారాన్ని కూడా ఆమె తోసిపుచ్చారు.

ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మాత్రం తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సోనియా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రభుత్వంలో తగిన గుర్తింపు, అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో కొన్ని సూచనలు చేసినట్లు వివరించారు.

2004 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కొన్ని నెలల ముందే తాను ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు సోనియా వెల్లడించారు. ఈ విషయంలో తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా తనతో ఏకీభవించారని తెలిపారు. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవికి దూరంగా ఉండాలని వారు కోరినట్లు పేర్కొన్నారు.

మన్మోహన్ ఎంపిక వెనుక..
1991లో భారత ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నాయకుడిగా మన్మోహన్ సింగ్‌కు ఉన్న గుర్తింపే ఆయన ఎంపికకు ప్రధాన కారణమని సోనియా వివరించారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చిన వామపక్ష పార్టీలతో ఆందోళనలు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు మన్మోహన్ ప్రతిష్ఠ ఉపయోగపడిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లక్ష్మీదేవి తలుపు తట్టి.. రూ.1.5 కోట్లు ఇస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement