వరంగల్: జనగామ-యాదాద్రి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ స్కామ్ వెలుగు చూసింది. ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో రూ. 3.72 కోట్ల అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరక 15 మంది నిందితులను జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అవినీతికి పాల్పడిన నిందితుల నంచి రూ. 63 లక్షల నగద, ఒక కారు, 2 ల్యాప్‌టాప్‌లు, 5 డెస్క్‌టాప్‌లు, 17 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసుగా నిర్దారించారు. ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది పరారైనట్లు తెలుస్తోంది.


