వన్యప్రాణులను కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులను కాపాడుకోవాలి

Mar 4 2026 8:23 AM | Updated on Mar 4 2026 8:23 AM

వన్యప్రాణులను కాపాడుకోవాలి

హనుమకొండ డీఎఫ్‌ఓ లావణ్య

న్యూశాయంపేట: వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హనుమకొండ డీఎఫ్‌ఓ లావణ్య అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సుబేదారి ఫారెస్ట్‌ కాంప్లెక్స్‌ నుంచి హంటర్‌రోడ్డులోని కాకతీయ జూ పార్కు వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. వన్యప్రాణులతోపాటు ఔషధ, సుగంధ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. అసిస్టెంట్‌ క్యూరేటర్‌ బి.మయూరి, వెటర్నరీ డాక్టర్‌ కార్తికేయ, సెక్షన్‌ ఆఫీసర్లు సూరిదాస్‌ సింగ్‌, శివకుమార్‌, బీట్‌ ఆఫీసర్లు శారద, సురేశ్‌, శ్వేత, జూపార్కు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement