బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026
రంగుల పండుగ..
సీనియర్స్ వర్సెస్ జూనియర్స్
నిట్ వరంగల్‌లో సోమవారం అర్ధరాత్రి తర్వాత జూనియర్స్, సీనియర్స్ విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు.
హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లా పరిధిలో జరిగిన వేడుకల్లో చిన్నారులు, యువతీయువకులు పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా రంగుల వేడుకల్లో మునిగితేలారు. రంగులు పూసుకుని నృత్యాలు చేశారు. నగరంలో పలుచోట్ల హోలీ ఈవెంట్లు నిర్వహించారు. డీజే పాటలతో హోరెత్తించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాండ్ వాయిద్యాల మధ్య పోలీస్ అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్‌ను అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, రంగులతో ముంచెత్తారు. – సాక్షి నెట్‌వర్క్


