అసంపూర్తిగా కాజీపేట–విజయవాడ రైల్వే లైన్ పనులు
మూడోలైన్ పూర్తయితే
ప్రయోజనాలు..
3
వ
లైన్..
సాక్షిప్రతినిధి, వరంగల్:
‘మీరు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడోలైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్‌పై చర్చ జరిగింది. సుమారు రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది.
ముందుకుసాగని
28 హెక్టార్ల భూసేకరణ..
కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్‌కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్‌లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు 95 శాతం వరకు పూర్తయ్యిందని చెబుతున్నా.. పెండింగ్‌లో ఉన్న 5 శాతం పనులతో కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు మోక్షం కలగడం లేదు.
44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం..
వాస్తవానికి హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్‌కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్‌లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
పదేళ్లయినా
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది.
ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. రెండు ప్రధాన రాష్ట్రా(తెలంగాణ, ఏపీ)లను కలిపే ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడో లైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది. గూడ్స్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే వీలు కలుగుతుంది.
ఈ మార్గంలో విపరీతమైన
ట్రాఫిక్ సమస్య
219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు
2016–17లో రూ.3,103.99
కోట్లకు అంచనాలు
44.624 కిలోమీటర్లు
అసంపూర్తిగా పనులు
భూసేకరణ, నిధుల కొరతే
అసలు సమస్య


