సాక్షి హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 17శాతం రిజర్వేషన్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లలో 25శాతం కోత విధించారని ఆరోపణలు గుప్పించారాయన. గురువారం కల్వకుర్తికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని పరిశ్రమలకు చెందిన భూములను పప్పు, బెల్లం మాదిరిగా సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారు. బాలానగర్, జీడిమెట్లలోని పరిశ్రమల భూములను తక్కువ ధరకే బడాబాబులకు అప్పనంగా రాసిస్తున్నారు. తన అననూయులకు కూకట్ పల్లిలో సీఎం రేవంత్ గజం రూ. 8,000లకే ఇచ్చేస్తూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా వ్యవహారిస్తున్నారు. తెలంగాణలో రూ. ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం జరిగితే.. అందులో రేవంత్ వాటా 50శాతం.
.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే. రాష్ట్రం కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్‌తో అసలు యుద్ధం 2028లో. అందుకోసం జనవరినుంచి పార్టీని సంస్థగతంగా బలోపేతం చేస్తాం. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను సీఎం చేయాలని ఇదివరకే ఫిక్స్ అయిపోయారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


