ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద ఫారం-6లో మార్పులను ఎన్నికల సంఘం తొలగించింది. మార్పులను చట్ట విరుద్ధం అంటూ గతంలో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఎస్ఐఆర్ ముగిసిన రాష్ట్రాల్లో పాత ఫారం-6 మళ్ళీ అమల్లోకి తెచ్చారు. ‘సర్’ డిక్లరేషన్‌పై ఈసీ కీలక మార్పు చేసింది.
ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లోని అదనప ‘సర్’ డిక్లరేషన్‌ను ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసీ తొలగిస్తూ నిర్ణయం తీసకుంది. ఆయా ప్రాంతాల్లో కొత్త ఓటర్లు సాధారణ ఫారం-6 మాత్రమే సమర్పించాలి. ‘సర్’ ఇంకా కొనసాగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ అదనపు డిక్లరేషన్ కొనసాగించనున్నారు.
గతంలో ఈ డిక్లరేషన్ ద్వారా దరఖాస్తుదారులు, వారి తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గతంలో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాల్లో ఉన్నట్లు వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సెప్టెంబర్ 26న సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సమావేశంలో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ‘ఇరుముడి’ సీన్ రిపీట్!


