breaking news
Visually
-
చూపు లేకున్నా..చరిత్ర సృష్టించింది..!
తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన సాధారణ జలుబు ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. సూచించిన పెన్సిలిన్ మందు ఇచ్చిన రియాక్షన్ జీవితాన్నే అంధకారం చేసింది. అయినప్పటికీ అంతకు మించి ఏదో చేయాలి, తన కంటూ గుర్తింపు కావాలని ఆరాటపడింది. అలా అత్యంత కఠినతరమైన సీఏ కోర్సుని ఎంచుకుని సక్సెస్ అందుకుంది. ఇంత ఘనత సాధించినా.. ఉద్యోగాలిచ్చేందుకు ఒక్క కంపెనీ ముందుకు రాలేదు. కానీ ఆమె అజేయమైన ఆత్మవిశ్వాసం స్నేహితురాలి రూపంలో సాయం వెతుక్కుంటూ వచ్చి ఉద్యోగం ఇచ్చింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోనంత సక్సెస్ అందుకోవడమే కాదు ఇప్పుడు ఆ రంగంలో ఆమెనే బాస్ కావడం విశేషం. ఆ ధీర వనితే రజనీ గోపాలకృష్ణ తొమ్మిదేళ్ల వయసులో వచ్చిన సాధారణ జలుబు చూస్తుండగానే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అనుకోలేదేమె. ఆ తర్వాత ఆ చిన్నారికి సూచించిన పెన్సిలిన్ మందు తీవ్రమైన అలెర్జీలకు దారితీసి..నెమ్మదిగా కంటిచూపునే దూరం చేసింది. దాంతో ఆమె ప్రాథమిక గ్రాడ్యుయేషన్‌కి మించి చేయాలని స్ట్రాంగ్ నిర్ణయించుకుంది. కేవలం బీకామ్ పూర్తి చేస్తే ఆశించిన ఉద్యోగం లభించిందని నిర్ణయించుకునే ఇలా డిసైడ్ అయ్యింది. అర్థవంతమైన ఉపాధిని పొందేలా అవకాశాలను మెరుగుపరుచుకునేలా ఏదైనా చేయాలని భావించే అత్యంత కఠినతరమైన సీఏని ఎంచుకుంది. తన కంటి చూపు తగ్గిపోతున్న తరుణంలోనే తను సీఏ ప్రస్థానం మొదలైందని అంటోందామె. తన ఇంటర్ ప్రిపరేషన్ సమయంలో రెండో కన్ను కూడా పనిచేయడం మానేసిది. దాంతో ఏడేళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ 2002లో తిరగి వచ్చింది. ఈసారి సాంకేతిక సహాయకులు (స్క్రైబ్స్) మార్పుతో వచ్చింది. అప్పట్లో స్టడీ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీలు అందుబాటులో లేవు, కాబట్టి ఆమె పుస్తకాలను స్కాన్ చేసి వాటిని మార్చుకున్నారు. అలా 2003 కల్లా సీఏ పూర్తి చేసిన భారత తోలి అంధ మహిళగా చరిత్ర సృష్టించిది. ఇంత సాధించిన ఉద్యోగాలిచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. చేతిలో సీఏ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ..అవకాశాలన్ని మూసుకుపోతున్నట్లు అనిపించింది. అయితే ఒక స్నేహితురాలు ఆమె రెజ్యూమ్ని పంపడంతో చివరకు ఆమెకు ఉద్యోగం లభించింది. ఆమె బెంగళూరులో కమ్యూనిటీ కోఆర్డినేటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే సామాజికి సేవలు కూడా అందించింది. ముఖ్యంగా తనలా దృష్టిలోపంతో బాధపడుతున్న విద్యార్థులకు మద్దతునిచ్చింది. ఆ తర్వాత కార్పొరేట్ అకౌంటింగ్ పని కోసం ఇన్ఫోసిక్ మారినప్పుడూ మరింత ఉన్నతమైన దాని వైపుకి ఆకర్షితురాలై ఎన్జీవో రంగానికి మారింది. అలా సీనియర్ ఫైనాన్స్ మేనజర్ అయ్యారు. ఆ పదవి, అందులోని నైపుణ్యం ఆమెను సామాజిక మార్పు తీసుకోరావాలనే ఆమె ఆశయానికి సరిగ్గా సరిపోయింది. ప్రస్తుతం ఆమె ఆదాయపు పన్ను చట్టం, ఎఫ్సీఆర్ఏ కార్మిక చట్టాలకు సంబంధించిన రూల్స్‌ని దాతలకు నివేదించేలా రూపకల్పన చేయడం, గ్రాంట్ సైకిల్ నిర్వహణ, ఆర్థిక సామర్థ్యం పెంపు వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఆమె చాణక్య విశ్వవిద్యాలయంలోని ఫైనాన్స్ కమిటీలో గౌరవ సభ్యురాలిగా పనిచేస్తోంది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో కలిసి భారతదేశవ్యాప్తంగా పౌర సమాజ సంస్థలకు శిక్షణ ఇస్తోంది.వరించిన పురస్కారాలు..ఆమె పట్టుదలకు గుర్తింపుగా 2014లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 2018లో మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆమెకు ఫస్ట్ లేడిస్ అవార్డుని ప్రదానం చేసింది. వీటి తోపాటు అనేక రాష్ట్రాస్థాయి గౌరవాలను పొందారు. అంతేగాదు డాక్టర్ రంగస్వామి అకాడమీ ఫర్ ఫిస్కల్ రీసెర్చ్ అడ్ ది సోసైటీ ఆఫ్ ఆడిటర్స్ ప్రచురించిన 'నైటింగేల్స్ 2.0: హౌ ఎలెవెన్ ఉమెన్ షోడ్ గ్రిట్, గట్స్ & గంప్షన్' అనే పుస్తకంలో ఆమె గురించి ప్రస్తావించడం విశేషం. చివరగా ఆమె అందరిలోనూ వైకల్యాన్ని చూసే తీరు మారాలని నొక్కి చెబుతోంది దివ్యాంగులు కొన్ని చేయలేకపోవచ్చు. కానీ వాళ్లు అసాధారణ పద్ధతిలో తమ ప్రతిభను చాటుకోగలరని గుర్తించండి చాలు. ఎల్లప్పుడూ జాలి చూపిస్తూ..దయతో బతికేలా చేయొద్దు..సాధారణ వ్యక్తుల్లా చూడకపోయినా..కనీసం మాకు సామర్థ్యం ఉందని గుర్తించండి చాలు అని అంటోంది రజనీ గోపాలకృష్ణ.ఇదీ చదవండి: వేద విద్య నేర్చుకుంటూనే.. ఇస్రో శాస్త్రవేత్త రేంజ్‌కి!) -
ఫీజుల్లేని పాఠశాల..!
అంధ, బదిర పిల్లల అభివృద్ధే ధ్యేయంగా, సమాజంలో వారికి మంచి గుర్తింపు రావాలన్నదే ఆశయంగా ఓ పాఠశాల పాటుపడుతోంది. వ్యక్తిగత అనుభవాలను రంగరించి విద్యాబోధనకు జోడించి వారి భవితకు సహకరిస్తోంది. పరీక్షలు మార్కులే ధ్యేయంగా పోటీ తత్తంలో నిర్వహిస్తున్న పాఠశాలలున్న నేటి తరుణంలో... ఇబ్బడి ముబ్బడి ప్రవేశాలకు దూరంగా... ఒక్క రూపాయి కూడ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఆ విద్యాలయం కొనసాగుతోంది. 1998 లో ఆచార్య రకుమ్ స్థాపించిన ఆ సంస్థ.. నేడు ఎంతోమంది పౌరులను దేశానికి అందిస్తోంది. ఆచార్య శ్రీ రకుమ్ స్కూల్ ఫర్ ది బ్లైండ్... బెంగళూరులో 1998 లో స్థాపించి ప్రస్తుతం మూడు శాఖలను నిర్వహిస్తోంది. ఎటువంటి ప్రభుత్వ, విదేశీ సంస్థలనుంచీ ఆర్థిక సాయం ఆశించకుండా... పిల్లలకు ఉచిత శిక్షణతోపాటు, ఆహారం, దుస్తులు, వృత్తి శిక్షణ అందిస్తోంది. ప్రజల సహాయ సహకారాలతో విద్యార్థులను తమ స్వంత పిల్లలుగా సాకుతోంది. ప్రస్తుతం ఆరు వందలమంది విద్యార్థులతో ఆ విద్యాలయం దిన దిన ప్రవర్థమానమౌతోంది. మారు మూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలనుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ చేరుతుంటారు. ఎటువంటి ఆర్థిక సాయం లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలో ప్రతిరోజూ తమకు అవసరమయ్యే సబ్బులు, షాంపూలు, పాలు వంటి వస్తువుల జాబితాను విద్యార్థులు బ్లాక్ బోర్డ్ పై రాసి బయట పెడతారు. స్థానిక ప్రజలు, దయ కలిగిన వారు బోర్డును చూసి స్పందించి వారికి తోచిన సహాయం అందిస్తుంటారు. మిగిలిన అవసరాలు మాత్రం పిల్లల జీవిత పోరాటంలో భాగమేనని నిర్వాహకుడు రకుమ్ చెప్తారు. 1988 లో రికార్డు నెలకొల్పిన కరాటే ఛాంపియన్ రకుమ్. పలురకాల విద్యల్లోనూ ప్రావీణ్యం ఉన్న ఆయన... జపనీస్ సహా పలు భాషల్లో మాట్లాడగలడు. నేచురోపతి వైద్యంలో కూడ ప్రావీణ్యం కలిగిన వాడు. విద్యార్థులను ఉన్నత స్థితికి తెచ్చే ప్రయత్నంతోపాటు, వారికి మార్షల్ ఆర్ట్స్ లో కూడ తర్ఫీదునిస్తున్నారు. సెలవుదినాల్లో వంట, కార్పెంటరీ, ప్లంబర్ వర్క్, ఎలక్ట్రికల్ రిపేర్లు నేర్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి దాటిన పిల్లలకు సైక్లింగ్, డ్రైవింగ్ నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. జీవితంలో వారు ఏ పరిస్థితిలోనైనా ధీమాగా బతకగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పాఠశాల వయసునుంచే వారికి అందిస్తున్నారు. ఇప్పటికే ఆ పాఠశాలలో ఎంతోమంది యోగాలో ప్రావీణ్యం పొంది, కరాటేలో బ్లాక్ బెల్ట్ పొంది ప్రపంచంలో ఎక్కడైనా తమ విద్యను వినియోగించుకునే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలలో చదివిన పిల్లలు సివిల్ సర్వెంట్స్ అవ్వాలన్నది పాఠశాల నిర్వాహకుడు రకుమ్ ఆకాంక్ష. అందుకే విద్యార్థులకు ఆరోక్లాసునుంచే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. గత నెలలో ఈ పాఠశాలలో చదివిన ముగ్గురు విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడ రాశారు. అయితే ఈ పాఠశాలలో ఇటీవల పిల్లల అవసరాలు తీరడం కొంత కష్టంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బోర్డుపై తమ అవసరాలను రాసే విద్యార్థులు, ఇప్పడు ఫేస్ బుక్ పేజీల్లో కూడ పెడుతున్నారు. దీనికి స్పందించి అందించిన సహాయంతో కాలం గడుపుతున్నారు. ఇటువంటి పిల్లల బాధ్యత తన ఒక్కడిదే కాదని, సమాజానికి కూడ బాధ్యత ఉందని రకుమ్ అంటున్నారు. అయితేనేం అనుకున్నది సాధించేందుకు రకుమ్ పాటు పడుతున్నారు. దయగలవారెవరైనా ఇటువంటి పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలని సూచిస్తున్నారు.


