తెలుగు వెండితెరకు కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు రాషా తడానీ టాలీవుడ్‌లో కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఘట్టమనేని జయకృష్ణ (ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు) హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీలో రాషా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఫస్ట్ లుక్
శుక్రవారం (జనవరి 30న) ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో రాషా కుర్తీలో క్యూట్‌గా కనిపిస్తోంది. తన పాత్ర పేరును మంగ అని ప్రకటించారు. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం సినిమాల ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.
హిందీలో..
వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీకే ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే హీరో జయకృష్ణకు ఇదే తొలి సినిమా కాగా రాషా తడానీ మాత్రం హిందీలో ఆజాద్ సినిమాలో నటించింది. ఇందులో ఉయ్ అమ్మా.. అనే పాటలో అద్భుతంగా స్టెప్పులేసి జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
Marking a beautiful beginning ✨
Presenting #RashaThadani as ‘MANGA’ to Telugu Cinema from #SrinivasaMangapuram ❤️🔥
Get ready to witness her enchanting performance on the big screens soon 🫶
An @DirAjayBhupathi Film
A @gvprakash Musical#JayaKrishnaGhattamaneni @AshwiniDuttCh… pic.twitter.com/zYdxmCCsfM— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 30, 2026


