శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్సిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
మోహిని అవతారంలో ఊరేగిన శ్రీవారు
Feb 20 2017 12:24 PM | Updated on Sep 5 2017 4:11 AM
తిరుపతి: శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్సిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు మోహిని అవతారంలో ఊరేగారు. సాయంత్రం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ కోసం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి మధ్యాహ్నం శోభాయాత్రగా బయలుదేరి వెంకన‍్నకు లక్ష్మీహారం సమర్పించనున్నారు. కాగా, భక్తుల గోవింద నామ స్మరణ మధ్య ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Advertisement


