breaking news
subscriber
-
చాట్ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే..
అది.. నవంబర్ 30.. 2022.. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని ప్రారంభించడంతో ప్రపంచ దృష్టి పూర్తిగా మారిపోయింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఒక మిలియన్(పది లక్షలు) వినియోగదారులను చేరుకుంది. ఈ ఒక్కటి చాలు.. చాట్ జీపీటీ శక్తి ఏమిటో తెలియడానికి.. మూడేళ్ల తర్వాత వెబ్ యాక్సెస్, మెరుగైన తార్కిక కోణం, విప్లవాత్మక సొరా వీడియో జనరేషన్ యాప్ తదితర సామర్థ్యాలతో చాట్ జీపీటీ మరింత అభివృద్ధి చెందింది.పోటీనిస్తున్న తాజా వెర్షన్లుప్రస్తుత పరిస్థితిలో ఓపెన్ ఏఐ తన అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గూగుల్, ఆంత్రోపిక్ తదితర సంస్థల నుండి విడుదలవుతున్న పోటీ నమూనాలు ఓపెన్ ఏఐని సాంకేతిక సామర్థ్యం విషయంలో సవాల్ చేస్తున్నాయి. ఉదాహరణకు గూగుల్ యొక్క జెమిని 3.. ఆంత్రోపిక్ క్లాడ్ ఓపస్ 4.5లు ఓపెన్ ఏఐ తాజా వెర్షన్ల కంటే మెరుగైన పనితీరును కనబరిచాయి. ఈ బలమైన పోటీ ఓపెన్ ఏఐకి దక్కిన ‘ఫస్ట్-మూవర్ ప్రయోజనాన్ని కోల్పోయేలా చేస్తున్నదని నిపుణులు అంటున్నారు.గూగుల్‌తో పోలిస్తే..సాంకేతిక పోటీతో పాటు ఆర్థిక నిబద్ధతలు కూడా ఏపెన్ ఏఐకి పెను సవాల్‌గా మారాయి. కంపెనీ $1.4 ట్రిలియన్లు (సుమారు రూ. 125 లక్షల కోట్లు)కు పైగా ఏఐ మౌలిక సదుపాయాల ఒప్పందాలు కుదుర్చుకోవడంతో, ఈ ఖర్చులు మరింత భారంగా మారాయి. అదేసమయంలో శోధన, క్లౌడ్ కంప్యూటింగ్, కస్టమ్ టీపీయూ(టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్) చిప్‌ల వ్యాపారాలను కలిగి ఉన్న గూగుల్ లాంటి సంస్థలకు ఏఐ మానిటైజేషన్, మౌలిక సదుపాయాల నిర్వహణ సులభతరంగా ఉంది. ఈ అంతర్నిర్మిత ప్రయోజనం ఏఐ రేసులో గూగుల్‌కు మరింత బలాన్ని ఇస్తోంది.ప్రపంచ నమూనాలకు మద్దతుబహుళ భాషా నమూనాలకు (ఎల్ఎల్ఎంలు) సంబంధించి సైద్ధాంతిక ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. ఎల్ఎల్ఎంలు ఇప్పటికీ భ్రాంతులు (Hallucinations), తార్కిక అంతరాలను ఎదుర్కొంటున్నాయని నిపుణులు ఎత్తి చెబుతున్నారు. ఎల్ఎల్ఎంలు కేవలం గణాంక సంభావ్యత ఆధారంగా తదుపరి పదాన్ని అంచనా వేయడం ద్వారా పనిచేస్తాయి. వాస్తవానికి ప్రపంచపు స్థిరమైన అవగాహనను కలిగి ఉండవు. ఈ పరిమితుల కారణంగా కొంతమంది నిపుణులు.. కృత్రిమ సాధారణ మేధస్సు (ఏజీఐ) మెరుగైన మార్గంగా గుర్తిస్తూ, భౌతిక ప్రపంచంతో సంకర్షణ చెందగల ‘ప్రపంచ నమూనాలకు’ (World Models) మద్దతు పలుకుతున్నారు.సామర్థ్యంలో వెనుకంజఏఐ పరిశ్రమలో మరో యుద్ధం జరగబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే యూజర్ ఇంటరాక్షన్ ఫ్రంట్. ఓపెన్ ఏఐకి చెందిన అట్లాస్,పెర్ప్లెక్సిటీకి చెందిన కామెట్ వంటి ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్లు వెబ్‌తో వినియోగదారుల పరస్పర చర్యను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో యూజర్ అనుభవాన్ని ఎవరు గెలుచుకుంటారనే దానిపై భవిష్యత్తు ట్రాఫిక్, ఆధిపత్యం ఆధారపడి ఉంటుంది. చాట్ జీపీటీ మొదలుపెట్టిన ఈ విప్లవం కొనసాగుతున్నప్పటికీ, టెక్ దిగ్గజాల మధ్య తీవ్రమైన పోటీ కారణంగా.. ఏఐ సామర్థ్యం సాకారం కావడానికి కొంత సమయం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చాట్ జీపీటీతో ప్రయోజనాలుచాట్ జీపీటీ అనేది సహజ భాషా ప్రాసెసింగ్‌లోని అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి, తక్షణమే సమాచారాన్ని అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది యూజర్ అడిగిన ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలు, క్లిష్టమైన విషయాలకు సులభమైన వివరణలు, వివిధ భాషలలోకి అనువాదాలు, వ్యాసాలు లేదా ఈమెయిల్స్ వంటి కంటెంట్‌ను సృష్టిస్తుంది. సృజనాత్మక రచనలకు దోహదపడేలా కొత్త ఆలోచనలను రూపొందించడంలో సహాయపడుతుంది. పరిశోధన, విద్య, వృత్తిపరమైన పనులలో వినియోగదారుల సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచడంలో చాట్ జీపీటీ శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.ఇది కూడా చదవండి: ప్రేమతో మొదలై.. ఉగ్రవాదంలో తేలింది..! -
కొత్త మొబైల్ యూజర్లలో టాప్ కంపెనీ
కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి ఆగస్టులో రిలయన్స్ జియో జోరు కొనసాగగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ దాదాపు ఏడాది తర్వాత భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం మొబైల్ సెగ్మెంట్లో ఆగస్టులో నికరంగా 35.19 లక్షల కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. జియో కస్టమర్లు అత్యధికంగా 19 లక్షల మేర పెరగ్గా బీఎస్ఎన్ఎల్ (13.85 లక్షలు), ఎయిర్టెల్ (4.96 లక్షలు) తర్వాత స్థానాల్లో నిల్చాయి.చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అన్ని ప్రైవేట్ సంస్థలను మించి బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా యూజర్లను దక్కించుకుంది. అప్పట్లో కంపెనీ 3జీ సేవలను మాత్రమే అందించేది. అయితే, ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లను పెంచేయడం బీఎస్ఎన్ఎల్కి కలిసొచ్చింది. కంపెనీ ఇటీవలే దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించింది. ఇక, తాజాగా జూలైలో 122 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ సబ్ర్‌స్కయిబర్స్ సంఖ్య ఆగస్టులో 122.45 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 3.08 లక్షల యూజర్లను కోల్పోయింది. బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్లో (మొబైల్, ఫిక్సిడ్ లైన్ కలిపి) 50 కోట్ల కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో 30.9 కోట్ల కనెక్షన్లతో భారతి ఎయిర్టెల్, 12.7 కోట్లతో వొడాఫోన్ ఐడియా, 3.43 కోట్ల కనెక్షన్లతో బీఎస్ఎన్ఎల్, 23.5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లతో ఏట్రియా కన్వర్జెన్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
30 కోట్ల సబ్బర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే..!
-
జియో జోరు..బీఎస్ఎన్ఎల్కు ఎదురుదెబ్బ
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రైవేట్ టెలికం రంగ సంస్థ జియో భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జియో అతిపెద్ద ల్యాండ్‌లైన్ సర్వీసుల్ని వినియోగించే సంస్థల జాబితాలో చేరింది. దేశంలో టెలికాం సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారిగా వైర్‌లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం జియో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. దీంతో జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. వైర్లెస్ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల జాబితాలో జియో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో జియోకు కొత్తగా 32.8 లక్షల వినియోగదారులు చేరడంతో, తన మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు పెంచుకుంది. -
టెలికం సబ్స్క్రైబర్లు @ 119.88 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్య ఏప్రిల్ నెలలో 119.88 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే యూజర్ల పెరుగుదలలో 0.36 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ వృద్ధి రేటు ఏడు నెలల కనిష్ట స్థాయి. చివరగా గతేడాది అక్టోబర్ నెలలో వృద్ధి 2.67 శాతంగా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ఈ విషయాలను వెల్లడించింది. మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 117.46 కోట్లుగా ఉంది. కొత్త యూజర్లను ఆకర్షించడంలో రిలయన్స్ జియో తన దూకుడును కొనసాగిస్తోంది. ఇది ఏప్రిల్ నెలలోని మొత్తం కొత్త మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో 87 శాతం వాటాను ఆక్రమించింది. అయితే జియో గతేడాది డిసెంబర్లో 2 కోట్ల మంది కొత్త యూజర్లను పొందితే.. ఈ ఏప్రిల్‌లో మాత్రం కేవలం 38.7 లక్షల మంది కొత్త యూజర్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఇక జియో తర్వాతి స్థానంలో ఎయిర్టెల్ ఉంది. దీని మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కొత్తగా 28.5 లక్షలు పెరిగింది. ఇక ల్యాండ్‌లైన్ యూజర్లలో 0.42 శాతం క్షీణత నమోదయ్యింది.


