జియో జోరు..బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎదురుదెబ్బ

Reliance Jio Become The Largest Fixed Line Service Provider In August - Sakshi

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రైవేట్‌ టెలికం రంగ సంస్థ జియో భారీ షాక్‌ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జియో అతిపెద్ద ల్యాండ్‌లైన్‌ సర్వీసుల్ని వినియోగించే సంస్థల జాబితాలో చేరింది. దేశంలో టెలికాం సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారిగా వైర్‌లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది.

టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం జియో ఫిక్స్‌డ్‌ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ జియో ఫైబర్ వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. దీంతో జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు.  

వైర్‌లెస్‌ మొబైల్ నెట్‌వర్క్‌ వినియోగదారుల జాబితాలో జియో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో జియోకు కొత్తగా 32.8 లక్షల వినియోగదారులు చేరడంతో, తన మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు పెంచుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top