టెలికం సబ్‌స్క్రైబర్లు @ 119.88 కోట్లు | Telecom subscriber base crosses 1,198 million in April | Sakshi
Sakshi News home page

టెలికం సబ్‌స్క్రైబర్లు @ 119.88 కోట్లు

Jun 15 2017 12:21 AM | Updated on Sep 5 2017 1:37 PM

టెలికం సబ్‌స్క్రైబర్లు @ 119.88 కోట్లు

టెలికం సబ్‌స్క్రైబర్లు @ 119.88 కోట్లు

దేశంలో టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏప్రిల్‌ నెలలో 119.88 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే యూజర్ల పెరుగుదలలో 0.36 శాతం వృద్ధి నమోదయ్యింది.

న్యూఢిల్లీ: దేశంలో టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏప్రిల్‌ నెలలో 119.88 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే యూజర్ల పెరుగుదలలో 0.36 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ వృద్ధి రేటు ఏడు నెలల కనిష్ట స్థాయి. చివరగా గతేడాది అక్టోబర్‌ నెలలో వృద్ధి 2.67 శాతంగా నమోదయ్యింది. టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ ఈ విషయాలను వెల్లడించింది. మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 117.46 కోట్లుగా ఉంది. కొత్త యూజర్లను ఆకర్షించడంలో రిలయన్స్‌ జియో తన దూకుడును కొనసాగిస్తోంది.

ఇది ఏప్రిల్‌ నెలలోని మొత్తం కొత్త మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో 87 శాతం వాటాను ఆక్రమించింది. అయితే జియో గతేడాది డిసెంబర్‌లో 2 కోట్ల మంది కొత్త యూజర్లను పొందితే.. ఈ ఏప్రిల్‌లో మాత్రం కేవలం 38.7 లక్షల మంది కొత్త యూజర్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. ఇక జియో తర్వాతి స్థానంలో ఎయిర్‌టెల్‌ ఉంది. దీని మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కొత్తగా 28.5 లక్షలు పెరిగింది. ఇక ల్యాండ్‌లైన్‌ యూజర్లలో 0.42 శాతం క్షీణత నమోదయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement