అదేం పెద్ద సమస్య కాదు.. 'రామాయణ'పై యష్ కామెంట్స్ | Actor Yash Reveals About Ramayana Movie And Acting With Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

Yash Ramayana: మా ఇద్దరి సీన్స్.. యష్ చెప్పిన 'రామాయణ' సంగతులు

Apr 15 2026 10:17 AM | Updated on Apr 15 2026 10:31 AM

Actor Yash Reveals About Ramayana Movie And Acting With Ranbir Kapoor

భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా పరిమిత బడ్జెట్‌తో తీశారు. కానీ రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తాము రామాయణాన్ని తీస్తున్నామని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పేసరికి అంతా షాకయ్యారు. కానీ కొన్నిరోజుల క్రితం రాముడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేయగా.. చెప్పిన బడ్జెట్‌కి చూపించిన విజువల్‌కి అస్సలు సంబంధం లేదే అనే కామెంట్స్ వినిపించాయి. ఆ విషయాలన్నీ పక్కనబెడితే ఇందులోనే రావణుడిగా చేస్తున్న యష్.. ఇప్పుడు మరిన్ని ‍ఆసక్తికర సంగతులు బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'రామాయణ'లో రావణుడిగా నటిస్తున్న యష్.. ఈ చిత్రం నిర్మాణంలోనూ భాగమయ్యాడు. తాజాగా అమెరికాలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్‌కి నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి హాజరయ్యాడు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ గురించి చెప్పుకొచ్చాడు. రణ్‌బీర్ కపూర్, తనకు మధ్య తొలి భాగంలో సీన్స్ ఏం లేవని క్లారిటీ ఇచ్చాడు. అంటే రాముడు-రావణుడి మొదటి భాగంలో అస్సలు కలిసే అవకాశం లేదు.

కలిసి సీన్స్ లేనప్పటికీ రణ్‌బీర్ కపూర్‌ని తాను పలుమార్లు కలిశానని చెప్పిన యష్.. అతడు ఓ అద్భుతమైన నటుడు అని ప్రశంసించాడు. తమ ఆలోచనలు కలిశాయని, కాబట్టి తామిద్దరి కెమిస్ట్రీ అనేది పెద్ద సమస్య కాదని యష్ అన్నాడు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీతగా సాయిపల్లవి చేస్తోంది. ఈ ఏడాది దీపావళికి తొలి భాగాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి వస్తారా లేదంటే అన్ని పాన్ ఇండియా సినిమాల్లానే వాయిదా వేస్తారా అనేది చూడాలి?

యష్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'రామాయణ' తొలి భాగంలో రాముడి, అతడి రాజ్యానికి సంబంధించిన సీన్స్.. మరోవైపు రావణుడు, అతడి రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలు చూపించనున్నారు. బహుశా రాముడు, సీత వనవాసానికి వచ్చే ఎపిసోడ్‌తో తొలి భాగాన్ని ముగిస్తారేమో అనిపిస్తుంది. రాముడు-రావణుడి మధ్య వైరం, యుద్ధం తదితర అంశాలన్ని సీక్వెల్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. సీక్వెల్‌ని వచ్చే ఏడాది దీపావళికి థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.

(ఇదీ చదవండి: పేరు వాడుకోవాలంటే రూ.112 కోట్లు ఇవ్వమన్నారు)

Advertisement
 
Advertisement
Advertisement