breaking news
sangeet function
-
ఇంటి వేడుకలు చుట్టూ ఇంతుల విజయ విహారం..!
చారిత్రక వైభవాన్ని సమకాలీన ఆధునికతను సమపాళ్లలో కలుపుకుని, విభిన్న రకాల వేడుకలకు నిలయంగా మారిన నగరంలో ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో మహిళలు చెప్పుకోదగిన విధంగా రాణిస్తున్నారు. మొదట ఈ రంగంలో పురుషాధిపత్యం కనిపించినా, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. తమదైన సృజనాత్మకత, అర్థవంతమైన నిర్వహణ, డీటెయిల్డ్ ప్లానింగ్‌తో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. సీఏ నుంచి ఈవెంట్స్ వరకూ.. చార్టెడ్ అకౌంటెంట్‌గా చేస్తూ దానిని వదిలేసి, అనుకోకుండా కోవిడ్ సమయంలో ఈ రంగంలోకి ప్రవేశించాను. ఇప్పటికి 500కి పైగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశాను. మహిళలు ప్రతి ఒక్కరితో సులభంగా కలిసిపోతారు. అందుకే రాణించగలుగుతున్నారు. ప్రస్తుతం పుట్టినరోజులు, శారీ సెర్మనీలు, షష్టిపూర్తి..వరకూ ప్రతి వేడుకకీ మహిళలే సారథ్యం వహిస్తున్నారు. – నిహారిక, శ్రీ వర్ణంఉద్యోగం కన్నా ఉన్నతంగా.. యుక్తవయసు నుంచీ మెహిందీ అంటే ఇష్టం. మా ఊరు నుంచి నగరానికి వచ్చాక ఎమ్మెస్సీ చదువుతూ పార్ట్ టైమ్ జాబ్ కోసం అన్వేషిస్తున్నప్పుడు ఈ ఆర్ట్ ద్వారా ఆదాయం గురించి తెలిసింది. అలా పార్ట్ టైమ్ ఆర్టిస్ట్‌గా.. ఆ తర్వాత ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా మారాను. పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో కంటిన్యూ చేస్తున్నాను. మెహందీతో పాటు నెయిల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాను. నెలలో 15రోజులు పనిచేసినా చాలు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కన్నా ఎక్కువే వస్తుంది. – శ్వేత గన్నోజు, మెహందీ ఆర్టిస్ట్ అందం.. అందరికీ.. ఇంటర్‌తో చదువు అటకెక్కింది. భర్త ప్రోత్సాహంతో ప్రొఫెషనల్‌గా నేర్చుకుని మేకప్ సేవలు అందిస్తున్నాను. బర్త్‌డే, ప్రీ వెడ్డింగ్ షూట్స్, సంగీత్ ఇలా ప్రతి వేడుకకూ మేకప్ అవసరం. ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ఆ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అందరూ మేకప్ కావాలంటున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఈ రంగంలో పలువురు యువతకు శిక్షణ అందిస్తున్నా. – భవానీ నవీన్, మేకప్ ఆర్టిస్ట్సమన్వయమే.. ‘సంగీత్’కి న్యాయం.. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ బాగా చేసేదాన్ని. డ్యాన్స్ పోటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే ఈ రంగంలోకి వచ్చేశా. దీంతో ఎనిమిదేళ్ల నుంచి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నా. ఈ రంగంలో రాణించాలంటే సహనం ఉండాలి. మనకు వచి్చనట్టు, నచ్చినట్టు కాదు అతిథుల బాడీ లాంగ్వేజ్ బట్టి నేర్పించాలి. – శ్రీవాణి, కొరియోగ్రాఫర్ వెడ్డింగ్ ప్లాన్ చేయడం ఒకెత్తయితే సంగీత్, మెహందీ, హల్దీ, రిసెప్షన్ వరకూ పెళ్లిలో భాగమైన కార్యక్రమాలన్నింట్లో మహిళల పాత్రే కీలకం. గత కొన్నేళ్లుగా ట్రెండీగా మారిన డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహణా బాధ్యతల్ని సైతం మహిళలు చేపట్టడం విశేషం. ఫ్లోరల్ డెకరేషన్, టేబుల్ సెట్టింగ్స్, బ్యూటీ, కాంపాక్ట్ స్టేజింగ్ వంటివి పండించడంలో మహిళలకు సహజంగా ఉండే సున్నితత్వం ఉపకరిస్తోంది. ‘సంగీత్’ వారధి.. నృత్యానికి సారధి నాట్యం, సంగీతం, డ్రామా కలగలిపిన మ్యూజికల్ ఫెస్టివల్ సంగీత్ ప్రోగ్రామ్. నృత్యం వచ్చిన, రాని, అంతంత మాత్రమే చేయగలిగిన ప్రతి ఒక్కరినీ సమన్వయపరచి సంగీత్ని రక్తి కట్టించే కొరియోగ్రాఫర్ అనే కీలకపాత్రలో మహిళలు సునాయాసంగా ఒదిగిపోతున్నారు. సంప్రదాయంగా నాట్యం నేర్పడంలో ఉండే సమర్థత, శ్రద్ధ, సమయ పాలన వీటన్నింటికీ మించి కుటుంబంతో మమేకమైపోయే నేర్పు.. ఈ పాత్రలో మహిళలకు తిరుగులేని ఎంపిక. సాంగ్ సెలక్షన్ నుంచి స్టెప్పుల ఎంపిక వరకూ అంతా తామై వ్యవహరిస్తున్నారు. మాటే మంత్రం.. ఫ్యామిలీ ఈవెంట్స్‌లో బంధుమిత్రుల్ని భాగస్వాములుగా చేసే పలు కార్యక్రమాలను నడిపించే కంపేరర్లుగా కూడా మహిళలు సాటిలేని రీతిలో రాణిస్తున్నారు. భాషాపరంగా నైపుణ్యం, హాస్య చతురత, కలుపుగోలు తనంతో కంపేరింగ్ క్వీన్స్‌గా మారిపోతున్నారు. ఇంగ్లిష్–తెలుగు మిక్స్‌తో సహజంగా మాట్లాడే వీరి శైలి ఆకట్టుకుంటోంది. చిన్నితెరపై యాంకర్స్‌గా ఎలాగైతే దుమ్ము రేపుతున్నారో.. అలాగే వినోద భరిత కార్యక్రమాల్లోనూ కంపేరర్స్గా నగరంలో సత్తా చాటుతున్నారు. తాను ఆర్జేగా ప్రారంభమైనా వివాహ వేడుకలతో పాటు బేబీ షవర్స్, కార్పొరేట్ ఈవెంట్స్‌లో కంపేరర్గా స్థిరపడడానికి కారణం అందులో అవకాశాలు, ఆదాయం బాగుండడమేనని నగరానికి చెందిన పూజిత అంటున్నారు. (చదవండి: ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది) -
అనంత్-రాధిక సంగీత్‌లో అదరగొట్టిన అందాల తారలు (ఫోటోలు)
-
అనంత్- రాధిక సంగీత్: జంటగా మెరిసిన క్రికెటర్లు.. హార్దిక్ మాత్రం ఒంటరిగా! (ఫోటోలు)
-
వరలక్ష్మి శరత్‌కుమార్ - నికోలయ్ సచ్దేవ్ సంగీత్ వేడుకల్లో ప్రముఖులు (ఫోటోలు)
-
వైరల్.. సంగీత్ ఫంక్షన్.. తోడు పెళ్లికూతురు సూపర్ డ్యాన్స్..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఏ పెళ్లి ఇంట్లో చూసిన పెద్ద ఎత్తున హడావిడీ కనిపిస్తోంది. సంగీత్‌లు, మెహిందీ, హల్దీ ఫంక్షన్లతో కళకళలాడుతున్నాయి. పెళ్లిలో వధువు లేదా వరుడు, వారి స్నేహితులు, బంధువులు డ్యాన్స్ చేయడం సాధారణమే. ఈ మధ్యకాలంలో ఇలాంటి వేడుకలు మరీ ఎక్కువయ్యాయి కూడా. అయితే తాజాగా ఓ సంగీత్ ఫంక్షన్లో తోడి పెళ్లి కూతురు డ్యాన్స్ అదరగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేమస్ పంజాబీ జానపద గీతం చిట్ట కుక్కడ్ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేసింది. లైట్ కలర్ లెహంగాతో ముస్తాబయి అందమైన చిరునవ్వుతో అంతకంగా అందంగా డ్యాన్స్ చేసింది. సూపర్ స్టెప్పులతో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరిని మంత్ర ముగ్దులను చేసేసింది. తన పక్కన మరో ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్నప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. యువతి డ్యాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ ఉన్న అతిథులు ఉత్సాహపరిచారు. ఈ వీడియోను ఫ్యాబ్ వెడ్డింగ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను మీరు కూడా చూడండి. చదవండి: Viral Video: ఎయిర్‌పోర్టు అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన శునకం View this post on Instagram A post shared by Fab Weddings- Wedding Planning & Photography Company (@fabwedding) -
పెళ్లిలో సీరియస్నెస్సా.. హాహాహా!
ముంబై : పెళ్లి బంధంతో ఒకటవ్వబోతున్న బాలీవుడ్ నటి సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజా జంటకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. వీరి వివాహం మంగళవారం జరగనుండగా.. వారం రోజుల నుంచే ఇరుకుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి మెహెంది వేడుకను ఘనంగా నిర్వహించారు. సోనం ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి అర్జున్ కపూర్, జాన్వీ, ఖుషి, అన్షులా, రాణి ముఖర్జీ, కరణ్ జోహర్‌తో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నేడు సంగీత్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ నటులతోపాటు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు పాల్గొననున్నారు. మరోవైపు సోనం పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరీనా కపూర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వివాహమనేది సంతోషంగా చేసుకునే వేడుక. అందులో సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు ఒకటవుతున్న వేళ.. అందరు ఒక దగ్గర చేరి చేసుకునే పార్టీ లాంటిది. పెళ్లి అనేది సీరియస్ అంశమే. కానీ పెళ్లితో ఏదో జరిగిపోతోంది.. కొత్తగా మొదలవుతుంది అంటూ ఉండదు. కాబట్టి ఆ తర్వాత ఏమిటన్నది సీరియస్‌గా తీసుకోకూడదు. ఇప్పటివరకు నటించాను.. పెళ్లి తర్వాత కూడా నటిస్తాను’ అని సోనమ్ పేర్కొన్నారు. -
వరుడి ముందు వధువు డ్యాన్స్ అదుర్స్
-
వరుడి ముందు వధువు డ్యాన్స్ అదుర్స్
న్యూఢిల్లీ: ఈ మధ్య వివాహాల ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల వరకు తమ తాహతకు తగినట్లుగా హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పెళ్లిల్లో సంగీత్లపై దృష్టి బాగా ఎక్కువవుతోంది. బరత్ నుంచి భారీ సంగీత్లపై తమ దృష్టిసారిస్తున్నారు. సంగీత్వంటి కార్యక్రమాల్లో సాధారణంగా పెళ్లి చేసుకుంటున్న వధువు, వరుడు కుటుంబ సభ్యులు ఆడిపాడుతుంటారు. పెళ్లి కూతురు, కుమారుడు కూడా ఈ పనిచేస్తారు. కానీ, పెళ్లి కుమారుడుని కూర్చొబెట్టి అతడి ముందు వధువు ఎలాంటి భయం, బిడియం లేకుండా డ్యాన్స్ చేయడం చాలా అరుదు. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ, నిజంగానే ఓ పెళ్లి వేడుకలో తన కాబోయే భర్తను కూర్చొబెట్టి అద్భుతంగా వధువు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. గత జనవరిలో యూట్యూబ్‌లోకి వచ్చిన ఈ వీడియోను ఇప్పటి వరకు 60లక్షలసార్లు వీక్షించారు. రికార్డు స్థాయిలో వధువు దాదాపు 17 నిమిషాలపాటు డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. ఆమె మాత్రమే కాకుండా తన స్నేహితురాళ్లు అనంతరం ఎమోషన్స్‌తో తన తల్లి, తండ్రి, బాబాయి, పిన్ని, ఆఖరికి నడవలేని తన నాయనమ్మ, చిన్న పిల్లలు ఇలా ప్రతి ఒక్కరు చక్కటి డ్యాన్స్ చేసి వరుడిని సంతోష పెట్టడమే కాకుండా సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఈ వీడియో చూసిన వాళ్లు వావ్ అని అనుకోవడమే కాకుండా ఎంతో ఎమోషనల్ అవుతారు.