నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు | Two Men Counting Cash After Stopping The Car Suspiciously | Sakshi
Sakshi News home page

నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు

Jan 14 2023 7:47 AM | Updated on Jan 14 2023 7:47 AM

Two Men Counting Cash After Stopping The Car Suspiciously - Sakshi

సాక్షి, బనశంకరి:  అనుమానాస్పదంగా కారు నిలిపి నగదు లెక్కిస్తున్న సమయంలో పోలీసులు దాడిచేసి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నిర్జీన ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఇన్నోవా కారును రోడ్డు పక్కన నిలిపి కరెన్సీనోట్లు లెక్కిస్తున్నారు. గస్తీలో ఉన్న పోలీసులు అనుమానంతో ఆరా తీశారు.

వారిద్దరూ హుసూ్కరు గ్రామపంచాయతీ బిల్‌కలెక్టర్‌ మల్లేశ్, నెలమంగల రాజేశ్‌గా తేలింది. లెక్కిస్తున్న నగదుకు సంబంధించి వివరాలు చెప్పాలని పోలీసులు కోరగా నీళ్లు నమిలారు. దీంతో నగదును స్వా«దీనం చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు నగదు అప్పజెప్పారు.     

(చదవండి: వాళ్లు పుట్టెడు దుఃఖంలో ఉంటే అక్కడకు వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement