వృద్ధ దంపతులను నిర్బంధించి రూ. కోటి నగలు, డబ్బు చోరీ | Elderly Couple Hostage Robbed Worth Rs 1cr Stolen Surat Gujarat | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతులను నిర్బంధించి రూ. కోటి నగలు, డబ్బు చోరీ

Jan 13 2023 9:36 PM | Updated on Jan 13 2023 9:36 PM

Elderly Couple Hostage Robbed Worth Rs 1cr Stolen Surat Gujarat - Sakshi

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో దొంగలు రెచ్చిపోయారు. వృద్ధ దంపతులు ఉన్న ఇంట్లోకి ప్రవేశించి వాళ్లను నిర్బంధించారు. అనంతరం గొంతుపై కత్తిపెట్టి బెదిరించి డబ్బులు, నగలతో పాటు విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

పదునైన కత్తి మెడపై పెట్టి డబ్బు, నగలు ఇవ్వకపోతే చంపేస్తానని దొంగ తనను బెదిరించాడని యజమాని సునీల్ కుమార్ శర్మ తెలిపారు. డబ్బులు, నగలు కలిపి వాటి విలువ మొత్తం రూ.కోటి వరకు ఉంటుందని చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇంట్లో ఇద్దరూ వృద్ధులు ఉంటున్నారని తెలిసే దొంగలు కావాలనే వాళ్లను లక్ష‍్యంగా చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement