‘గ్యాంగ్‌’ సినిమా చూపించారు.. ఇన్నోవా కార్లలో వచ్చి..

Fake CBI Officers Theft Rs 25 Lakh And Kg Of Gold In Karnataka - Sakshi

కోలారు(కర్ణాటక): కోలారు జిల్లా కేంద్రం భైరేగౌడ నగర్‌ ఐటీ, సీబీఐ అధికారులమం టూ చొరబడిన దుండగులు గ్యాంగ్‌ సినిమా తరహాలో భారీగా దోచుకుని పరారయ్యారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రెండు ఇన్నోవా కార్లలో ఐదుగురు వ్యక్తులు ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు రమేష్‌ ఇంటికొచ్చారు. ఐటీ, సీబీఐ అధికారులమని, తలు పులు తెరవాలన్నారు.

చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పరిచయం.. స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి

తలుపులు తీయడంతో ఇంట్లోకి వెళ్లిన వెంటనే రమేష్, కుటుంబ సభ్యులను పిస్టల్‌తో బెదిరించి వారి నోట్లో గుడ్డలు కుక్కి తాళ్లతో కట్టి వేశారు. ఇంట్లో ఉన్న రూ.25 లక్షలు, కిలో బంగారం, కొంత వెండి సామగ్రిని దోచుకున్నారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల హార్డ్‌ డిస్క్‌ను తీసుకుని కార్లలో పరారయ్యారు. కొంతసేపటికి రమేష్‌ దంపతులు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వా రు వచ్చి కట్లు విప్పారు. వెంటనే కోలారు నగ ర పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్పీ దేవరాజ్‌ విచారణ జరిపారు. పోలీసు జాగిలాలు, వేలిముద్రల నిపుణులతో ఆధారాలను సేకరించారు. దోపిడీ దొంగలు హిందీలో మాట్లాడినట్లు బాధితులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top