తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఖాతాల్లోకి నగదు | Rythu Bandhu Funds Released By Telangana Government, Details Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఖాతాల్లోకి నగదు

May 6 2024 9:14 PM | Updated on May 7 2024 10:31 AM

Rythu bandhu Funds Released By Telangana Government

సాక్షి,హైదరాబాద్‌: ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం(మే 6)రైతు బంధు నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకుగాను రూ.2 వేల కోట్ల దాకా ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. 

మూడు రోజుల్లో మొత్తం రైతుబంధు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఐదెకరాల పైన ఉన్నవారికి నగదు బదిలీ ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement